ఆర్గాంజా.. ఈ ఫ్యాబ్రిక్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇది చేతి అల్లికలతో తయారవుతుంది. ఈ ఫాబ్రిక్ మెత్తగా, సన్నగా, లేతగా ఉండటమే కాదు.. శరీరానికి హత్తుకుపోయేలా ఉంటుంది. ఆర్గాంజా క్లాత్‌పై ఉండే డిజైన్లు చాలా స్పష్టంగా.. అందంగా కనిపిస్తాయి.
ఫ్యాషన్ ట్రెండ్స్‌కు అనుగుణంగా.. ఈతరం అమ్మాయిలు ఎక్కువగా ఆర్గాంజా ఫ్రాక్స్‌ను ఇష్టపడుతున్నారు. ప్రస్తుతం ఆర్గాంజా ట్రెండ్ నడుస్తున్నది. సందర్భం ఏదైనా.. ఒక్కసారైనా ఆర్గాంజాలో మెరిసిపోవాలనుకుంటారు చాలామంది. మరెందుకు ఆలస్యం కింది ఫ్రాక్స్‌ను ఓసారి ప్రయత్నించి చూడండి!
బ్రౌన్ కలర్
ఈ బ్రౌన్ కలర్ ఫ్రాక్ చూడటానికి చాలా సింపుల్‌గా, డిఫరెంట్‌గా కనిపిస్తుంది. ఇది కంఫర్టబుల్‌గా కూడా ఉంటుంది. ఫంక్షన్‌లకు మాత్రమే కాదు రెగ్యులర్‌గా కూడా ఈ ఫ్రాక్‌ను వేసుకోవచ్చు.
మల్టీకలర్
మల్టీకలర్ ఫ్రాక్ చూడటానికి చాలా భిన్నంగా, అందంగా కనిపిస్తుంది. ముఖ్యంగా ఆర్గాంజా ఫాబ్రిక్‌పై రంగురంగుల డిజైన్లు స్పష్టంగా కనిపిస్తాయి.
పింక్ ఫ్రాక్
లేతగా ఉండే పింక్ కలర్ ఆర్గాం జా ఫ్రాక్‌ను ఇష్టపడని అమ్మాయిలుండరు. ఈ ఫాబ్రిక్‌లోని ఫ్రాక్ డిజైనింగ్ స్టుల్ చూడటానికి సింపుల్‌గా, గ్రాండ్‌గా కనిపిస్తుంది.
హల్దీ కలర్
పసుపు రంగు ఆర్గాంజా ఫాబ్రిక్‌పై ఉండే ఎరుపు, లేత ఆకుపచ్చ పువ్వుల డిజైన్లు చాలా అందంగా కనిపిస్తాయి. ఈ ఫ్రాక్ ఏ అకేషన్‌లో వేసుకున్న ప్రత్యేకంగా కనిపిస్తుంది.
రెడ్ కలర్
ఈ సెమిపాలిస్టర్ ఆర్గాంజా ఫాబ్రిక్‌పై గులాబీ రంగు పువ్వులు అద్భు తంగా కనిపిస్తున్నాయి. ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఈ ఫ్రాక్.. స్లివ్‌లెస్ హ్యాండ్స్‌తో పొందికగా కనిపిస్తున్నది.
గ్రీన్ కలర్
గ్రీన్ కలర్ ఆర్గాంజా ఫ్రాక్‌పై ఫ్లోర డిజైనింగ్ రావడం కాస్త డిఫరెంట్‌గా ఉంటుంది. చిన్న చిన్న పార్టీలకు, ఫంక్షన్లకు ఈ ఫ్రాక్‌కు చాలా కంఫర్టుగా ఉంటుంది.