calender_icon.png 8 January, 2025 | 3:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అజ్రక్‌లో అందంగా!

12-12-2024 12:00:00 AM

ప్రస్తుతం అజ్రక్ చీరలు మగువల మనసును దోచేస్తున్నాయి. మెరుపుదనంతో పాటు మృదువుగా ఉండటంతో మహిళలు వీటిపై మనసు పారేసుకుంటున్నారు. సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు ఈ రకం చీరలు ధరిస్తూ పార్టీలు, ఫంక్షన్లలో హోయలు ఒలకబోస్తున్నారు. అజ్రక్ చీరల్లో ఎరుపు రంగే ఎక్కువగా ఆకట్టుకుంటోంది.

ఈ రంగు చీరలు ఎక్కువగా మహిళలను ఆకర్షిస్తున్నాయి. ఇది ఎరుపు, నలుపు, తెలుపు రంగుల కలయికతో తయారవుతుండటంతో చాలామంది వీటికి ధరించేందుకు ఇష్టపడుతున్నారు. ఇటీవల బాలీవుడ్ బ్యూటీ అలియా బట్ అజ్రక్ చీరలో మెరిసిపోవడంతో ఫ్యాషన్ ప్రియుల చూపుల వీటిపై పడింది. ఇంకెందుకూ ఆలస్యం మీరు కూడా ట్రై చేయండి మరి.