calender_icon.png 15 January, 2025 | 6:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అందంగా హల్దీ

12-09-2024 12:00:00 AM

ఇంట్లో పెండ్లి అనగానే.. వారం ముందు నుంచే హడవిడి మొదలవుతుంది. ఈ వే డుకల్లో హల్దీ ఫంక్షన్ ఇప్పు డు కొత్త ట్రెండ్.. పెండ్లికి ఒకరోజు ముందుగా వధూవరు లను పసుపుతో మంగళస్నానాలు చేయించడం అనాది గా వస్తున్న ఆచారం. అయితే మంగళస్నానం అనే ఆచా రం గతం నుంచి ఉంది. కానీ కాలం మారుతున్నకొద్ది కొత్తపుంతలు తొక్కి హల్దీ ఫంక్షన్‌గా మారింది. ఇది పెండ్లి వేడుకలో ప్రత్యేకతను సంతరించుకున్నది. పెండ్లిళ్లలో ప్రస్తుతం హల్దీ ఫంక్షన్ వేడుకలు ఎప్పుడూ గుర్తిండిపోయేలా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. హల్దీలో ఈవెంట్‌లో పెండ్లి వధూవరుల ఫ్రెండ్స్, బంధువులు ఉత్సాహంగా పాల్గొంటారు. ఈ ఆనందకరమైన క్షణాలను కెమెరాల్లో బంధించి.. మరుపురాని అనుభూతిని చెందుతారు. మరెందుకు ఆలస్యం.. ఈ ట్రెండ్‌పై ఓ లూక్కేయండి..