calender_icon.png 5 March, 2025 | 7:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కమనీయం..రమణీయం.. శ్రీవెంకటేశ్వర కల్యాణం

05-03-2025 01:16:17 AM

తిమ్మాపూర్ మార్చి 4: కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని ఎల్‌ఎండి కాలనీలో గల శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణాన్ని వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య కన్నుల పండుగగా కళ్యాణాన్ని నిర్వహించారు.

శ్రీవారి 46వ అధ్యాయన బ్రహ్మోత్సవాలలో భాగంగా మంగళవారం ఉదయము సామూహిక తిరుప్పావై సేవాకాలము,సామూహిక శ్రీవిష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణము,ప్రాబోధకి నివేదన,ద్వారతోరణ ధ్వజకుంభారాధనలు, నిత్యహోమము, నిత్యపూర్ణాహుతి, శ్రీపద్మావతీవేంకటేశ్వరస్వామివార్ల కళ్యాణ మహో త్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ గిరిజామృ త్యుంజయ స్వామి వారి ఆలయం నుంచి ఆలయ కమిటీ పెద్దలు చల్ల మోహన్ రెడ్డి, సంఘం లక్ష్మణరావు,లు వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవానికి నూతన పట్టు వస్త్రాలు, తలంబ్రాలు, డోలోత్సవం మధ్య సమర్పించారు.

కళ్యాణాన్ని తిలకించేందుకు పట్టణ మండల నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలి రావడంతో పద్మావతి కళ్యాణ మండపం భక్తులతో కిక్కిరిసి పోయింది. అనంతరం స్వామి అమ్మవార్లకు ఓడి బియ్యం సమర్పించి చల్లగా ఉండాలని వేడుకున్నారు. అనంతరం సామూహిక అన్నప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ ఎన్జీవో రాష్ర్ట అధ్యక్షులు మారం జగదీశ్వర్, నీటిపారుదల శాఖ ఈఎన్సీ శంకర్, కరీంనగర్ ఉమ్మడి జిల్లా రవాణా శాఖ డిటిసి పెద్దింటి పురుషోత్తం, ఆలయ కమిటీ సభ్యులు పోలు కిషన్, ఒంటెల రవీందర్ రెడ్డి, ప్రసాద్ రెడ్డి, గంగారపు రమేష్, వెంకటేశ్వర్లు, లతోపాటు డి టి ఓ శ్రీకాంత్ చక్రవర్తి,, పలువురు పాలక సభ్యులు పాల్గొన్నారు.