calender_icon.png 3 October, 2024 | 6:49 PM

పేదల సమాధులపై మొక్కలు నాటి సుందరీకరణా?

03-10-2024 02:28:32 AM

బుల్డోజర్లు వస్తే ముందుగా మాపై నుంచి పోవాలి 

మూసీ నిర్వాసితులకు అండగా ఉంటాం 

కేంద్ర బొగ్గు, గనులశాఖ మంత్రి కిషన్‌రెడ్డి

మూసీ పరీవాహక ప్రాంతాల్లో పర్యటన

హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 2 (విజయక్రాంతి): మూసీ పరివాహక ప్రాంతం లో పేదల ఇండ్లపైకి బుల్డోజర్లు వచ్చినా, పేదల సమాధులపై మొక్కలు నాటి సుందరీకరణ చేయాలనుకుంటే తీవ్ర పరిణామా లుంటాయని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జీ కిషన్‌రెడ్డి హెచ్చరించారు.

పేదల ఇండ్లపైకి బుల్డోజర్లు రావాలంటే ముందుగా తమ పైనుంచి పోవాలని అన్నారు. అంబర్‌పేట నియోజకవర్గంలోని మూసీ పరివాహ క ప్రాంతాల్లో సొంత ఇండ్లను కోల్పోతున్న ముసారాంబాగ్, అంబేద్కర్‌నగర్, తులసీనగర్, కృష్ణానగర్ బస్తీల్లో బాధితులను కిషన్‌రెడ్డి బుధవారం పరామర్శించారు.

ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. మూసీ నిర్వాసితులకు బీజేపీ అండగా ఉం టుందనీ, వారికి అన్యాయం జరిగితే ఊరుకోబోమంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిం చారు. మూసీ పరివాహక ప్రాంత ప్రజలెవ్వరూ అధైర్య పడొద్దని సూచించారు. మూ సీ సుందరీకరణ పేరుతో పేదల ఇండ్లను కూల్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తుందని ఆరోపించారు.

పేదల ఇండ్లు కూల్చే అధికారం ఏ ప్రభుత్వానికి లేదని అన్నారు. అక్రమ నిర్మాణాల కూల్చివేత పేరిట రాష్ట్ర ప్రభుత్వం ధ్వంసరచన కనీవినీ ఎరుగని స్థాయిలో ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తుందని ఆందోళన వ్యక్తం చేశా రు. బస్తీలు, మూసీ పరీవాహక ప్రాంతాల ప్రజలపై గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం, నేటి కాంగ్రెస్ ప్రభుత్వం కర్కశంగా వ్యవహరించాయని పేర్కొన్నారు.

గతంలో మాజీ సీఎం కేసీఆర్ మూసీ సుందరీకరణ పేరుతో ఓ కార్పొరేషన్ ఏర్పాటు చేసి, హైడ్రా తరహాలోనే కూల్చివేతల కోసం ఇండ్లకు మార్కింగ్ చేశారని గుర్తుచేశారు. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో పేదలకు డబుల్ బెడ్‌రూం ఇండ్లు ఇస్తామని నాన్చివేత ధోరణతో మభ్యపెట్టిన కేసీఆర్.. ఒక్కరికీ కూడా ఇల్లు ఇవ్వలేదని చెప్పారు.

ఇక్కడి ప్రజలు తమ కష్టార్జితంతో కట్టుకున్న ఇండ్లు తమ కళ్ల ముందే చెదిరిపోతుంటే దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడు తున్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మూసీ సుందరీకరణకు రూ.1.50 లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నట్టు గొప్పలు చెప్పుకొంటుందని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రభు త్వానికి నిజంగా చిత్తశుద్ది ఉంటే అందులోని రూ.50 వేల కోట్లతో ఇల్లు లేని పేదలకు ఇండ్లు కట్టించి ఇవ్వాలని డిమాండ్ చేశారు.

అంబర్‌పేట నియోకవర్గంలో పేదల కోసం ప్రభుత్వ ఖర్చులతో రోడ్లు నిర్మించి, డ్రైనేజీ వ్యవస్థను ఆధునీకరించామనీ, రేషన్ కార్డు లు ఇచ్చి ఇంటి నంబర్లు కేటాయించినట్టు తెలిపారు. అనేక సంవత్సరాల తర్వాత సుం దరీకరణ పేరుతో పేదల ఇండ్లను కాంగ్రెస్ ప్రభుత్వం కూల్చేందుకు పూనుకోవడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కృష్ణ యాదవ్, బీజేపీ నాయకులు పాల్గొ న్నారు. ఈ సందర్భంగా బాధితులు ‘రేవంత్ హటావో.. తెలంగాణ బచావో’ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు.