calender_icon.png 4 March, 2025 | 6:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఒత్తిడిని ఓడించండి!

02-03-2025 12:00:00 AM

ఆఫీసులో పనులెన్ని ఉన్నా... కొన్నిసార్లు ఏకాగ్రత కుదరదు. ఇంటి పనిలోనూ మనసు పెట్టలేం. తీవ్ర ఆలోచనలతో ఒత్తిడికి గురవుతుంటాం. ఇటువంటి సమయాల్లో మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలంటున్నారు నిపుణులు.

* రోజులతరబడి తీరిక లేకుండా పెట్టే పరుగులు మెదడును ప్రభావితం చేస్తాయి. దైనందిన జీవితాన్ని ఇది అనాసక్తిని కలిగిస్తుంది. అప్పటివరకు క్రమశిక్షణగా పనిచేసిన శరీరం, మెదడు పూర్తిగా మొరాయిస్తాయి. దీన్ని దాటాలంటే మన భావోద్వేగాలకు అక్షరరూపమివ్వాలి. దీంతో ఒత్తిడి దూరమవుతుంది. ఈ అలవాటుతో ప్రతికూల ఆలోచనలు దూరమవుతాయి. 

* అలసినప్పుడు పనికి బ్రేక్ ఇచ్చినట్లే, మనసుకూ విశ్రాంతినివ్వాలి. మెదడును సమన్వయం చేయడానికి ఇది సాయపడుతుంది. ఈ బ్రేక్‌లో చిత్రకళ లేదా పాడటం వంటి అలవాట్లను సాధన చేయాలి. ఈ అభిరుచులు మనసుకు హాయిగా అనిపిస్తాయి. ఉత్సాహాన్ని నింపుతాయి.