నిర్మల్ (విజయక్రాంతి): మహిళలు అపరిచితుల పట్ల అప్రమత్తంగా ఉండాలని అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే 100 కు ఫోన్ కాల్ చేయాలని ఎస్సై గణేష్ అన్నారు. సోమవారం ఆర్థిక నేరాలు మహిళలకు రక్షణ సిటీ నిర్వాణ తదితరు అంశాలపై అవగాహన కల్పించారు. గ్రామాల్లో కొత్త వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఇంటికి తాళం వేసి బయటకు వెళితే పక్కింటి వారికి సమాచారం ఇవ్వడం వల్ల దొంగతనాలు జరగకుండా చూసుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో పోలీసులు సిబ్బంది పాల్గొన్నారు.