calender_icon.png 26 December, 2024 | 12:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అప్రమత్తంగా ఉండాలి : సీఐ

26-12-2024 01:07:55 AM

కోనరావుపేట, డిసెంబర్ 25 : సమాజంలో పెరుగు తున్న సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉం డాలని చందుర్తి  సిఐ  వెంక టేశ్వర్లు అన్నారు.  బుధవా రం రాత్రి కోనరావుపేట మండలం సుద్దాలలో పోలీ స్ మీకోసం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ అపరిచితుల ద్వారా వచ్చే ఎస్‌ఎంఎస్, ఈమెయిల్స్, వాట్సాప్ లో ద్వారా వచ్చే బ్లూ కలర్ లింకులను క్లిక్ చేస్తే మీ మొబైల్ లోని డాటా మొత్తం సైబర్ నేరగల చేతుల్లోకి పోతుందన్నారు.

ఎవరైనా సైబర్ నేరాలకు గురైతే వెంటనే 1930 కి కాల్ చేయాలన్నారు. యువత గంజాయి వంటి మత్తు పదార్థాలకు బానిసై భవిష్యత్తును నాశనం చేసుకోవదన్నారు. మాదకద్రవ్యాల వినియోగంతో జరిగే నష్టాలు, డ్రంక్ అండ్ డ్రైవ్, సీసీ కెమెరాల ఏర్పాటు,రోడ్డు నిబంధనలపై  ప్రజలకు అవగాహన కల్పించారు. అలాగే తల్లిదండ్రులు మైనర్లకు వాహనాలు ఇవ్వవద్దని ఒకవేళ ఇచ్చిన వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ప్రతి వాహనదారుడు రోడ్డు నిబంధనలు పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్సు ప్రశాంత్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ కచ్చకాయల ఎల్లయ్య,  పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.