09-04-2025 01:03:09 AM
రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి
రంగారెడ్డి జిల్లా, విజయక్రాంతి 08: సైబర్ ఆర్థిక నేరగాళ్లు చేసే మోసాలపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని రంగారెడ్డి జిల్లా సి.నారాయణరెడ్డి అన్నారు. ఆదర్శ కో ఆఫ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ హైదరాబాద్ బ్రాంచీ ఆధ్వర్యంలో సైబర్ ఆర్థిక నేరగాళ్ల మోసాల తీరుపై జాగ్రత్త అనే పుస్తకన్నీ రచించారు. మంగళవారం రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో కలెక్టర్ సి. నారాయణ రెడ్డి చేతుల మీద ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ సి. నారాయణరెడ్డి మాట్లాడుతూ.. సైబర్ ఆర్థిక నేరగాళ్ల చేసే మోసాలపై అప్రమత్తంగా ఉండాలన్నారు. తెలియని నెంబర్ల నుంచి వచ్చే ఫోన్‌కాల్స్‌కు స్పందించవద్దన్నారు. సైబర్ నేరాలపై పోలీసుశాఖ ఎప్పటికప్పుడు సూచనలు చేస్తుందన్నారు. వారు చేసే సూచనలు తప్పకుండా పాటించాలని ప్రజలకు కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కన్స్యూమర్ కమిషనర్, వైస్ చైర్మన్ డి. గోపాల్‌నారాయణ్, రిటైర్డ్ ఆర్మీ కమెండర్ ఎల్.కే. రెడ్డి కందివనం, జీ.ఆర్ రెడ్డి తదతరులు పాల్గొన్నారు.