కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బీర్కూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల, ఉన్నత పాఠశాలలో పోలీస్ కళాజాత బృందం ఆధ్వర్యంలో షీటీం, సైబర్ క్రైం, బాల్య వివాహలపై అవగాహన కల్పించారు. అత్యవసర పరిస్థితుల్లో షీ టీం నెంబర్ 8712686094, సైబర్ నేరాల గురించి టోల్ ఫ్రీ నెంబర్ 1930కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ఇంచార్జి ప్రిన్సిపాల్ చంద్రశేఖర్, ఇంచార్జి హెచ్‌ఎం శివరాం, పోలీస్ కళాబృందం, సభ్యులు ప్రభాకర్, శేషారావు, సాయిలు, బీర్కూర్, పోలీస్ సిబ్బంది శ్రీనివాస్, అనిల్‌కుమార్ పాల్గొన్నారు.