calender_icon.png 5 November, 2024 | 1:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి : డి.ఎస్.పి

05-11-2024 11:15:49 AM

ఇల్లెందు (విజయక్రాంతి)భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలోని స్టేషన్ బస్తీ, బోరింగ్ తండాలో మంగళవారం ఉదయం ఇల్లందు పోలీసులు నాకాబందీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇల్లందు డిఎస్పి చంద్రభాను మాట్లాడుతూ.. సైబర్ నేరాలు పైన అప్రమత్తంగా ఉండాలని, ఫేస్బుక్, ట్విట్టర్, మెసేజ్ లకు, మెయిల్స్కు, ఆన్సర్ ఇవ్వవద్దని, వాటి పట్ల జాగ్రత్తగా ఉండాలని గంజాయి, గుట్కా, మత్తు పదార్థాలు వాటి జోలికి పోవద్దని యువత పెడదారిన పడవద్దని తెలిపారు.

ట్రాఫిక్ రూల్స్ పాటించాలని, హెల్మెట్ లేకుండా ఎవరు కూడా ప్రయాణించవద్దని, ఒకవేళ ఏదైనా ప్రమాదం జరిగితే వారి కుటుంబం రోడ్డున పడుతుంది, జీవనోపాధి కోల్పోతారని అన్నారు. ఎవరైనా గంజాయి, మత్తు పదార్థాలు వివరములు ఇచ్చిన వారి పేర్లు రహస్యంగా ఉంచుతాము వారికి తగిన ప్రోత్సాహం ఇస్తామని తెలిపారు. నాకాబందీలో ప్రతి ఇంటిని క్షున్నంగా తనికీ చేశారు. గుర్తుతెలియని, కొత్తవారి పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇల్లందు సిఐ  బత్తుల సత్యనారాయణ, ఎస్సైలు నాగులమీర, సందీప్, సూర్య, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.