calender_icon.png 26 October, 2024 | 7:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి : జిల్లా ఎస్పీ

26-10-2024 06:00:14 PM

కామారెడ్డి (విజయక్రాంతి): సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ సింధు శర్మ కోరారు. శనివారం కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం కస్తూర్బా గాంధీ విద్యాలయంలో షీ టీం పై అవగాహన కల్పించారు. మహిళలు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని 1930 కాల్ చేసి టోల్ ఫ్రీ నీ వినియోగించుకోవాలన్నారు. అత్యవసర పరిస్థితుల్లో టోల్ ఫ్రీ నెంబర్లు 100, 108, 1930, 181 సమాచారం ఇచ్చి సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రతి మహిళా ఫోన్ లో టి సేఫ్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలన్నారు. ఇది మహిళలకు చాలా అత్యవసరమైనదని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాబృందం ప్రతినిధులు ప్రభాకర్, శేషారావు, సాయిలు, పాఠశాల సిబ్బంది విద్యార్థినిలు పాల్గొన్నారు.