09-04-2025 12:45:29 AM
చెన్నూర్ రూరల్ సీఐ సుధాకర్
చెన్నూర్, ఏప్రిల్ 8 : సంఘ విద్రోహ శక్తుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెన్నూర్ రూరల్ సీఐ సుధాకర్ అన్నారు. మంగళవారం తెలంగాణ - మహారాష్ట్ర సరిహద్దు కోటపల్లి మండలంలోని వెంచపల్లి గ్రామంలో కోటపల్లి ఎస్ ఐ రాజేందర్ తో కలిసి సందర్శించి తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రాణహిత నది తీరంను సందర్శించి పడవలు నడిపే యజమానులు, మత్స్యకారులతో మాట్లాడారు. సరిహద్దులలో అనుమానాస్పదంగా ఎవరైనా సంచ రించినా, కదలికలలో తేడా కనిపించిన వెం టనే పోలీస్ లకు సమాచారం అందించాలన్నారు.
అనంతరం గ్రామంలో సమావేశం ఏర్పాటు చేసి గ్రామస్తులతో మాట్లాడారు. గ్రామంలో సిసి కెమెరాల ఏర్పాటుకు గ్రామస్తులు సహకరించాలని సూచించారు. సీసీ కెమెరాల ద్వారా నేరాల నియంత్రణ సాధ్యం అవుతుందని పేర్కొన్నారు. సైబర్ మోసాలు జరుగుతున్న తీరును వివరించి, నేరాల నియంత్రణ చర్యలను వివరించారు. డ్రగ్స్, గంజాయి నియంత్రణ కు సహరించాలని, గ్రామాల్లో మత్తు పదార్థాల విక్రయాలు జరిగిన, సేవించిన పోలీస్ లకు తెలియచేయ లన్నారు. మహిళ భద్రతకు భంగం కలిగిస్తే చర్యలు తప్పవన్నారు.