calender_icon.png 19 March, 2025 | 8:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టీబీ వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలి

19-03-2025 02:21:06 AM

జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి 

కరీంనగర్,మార్చి18(విజయక్రాంతి): టీబీ వ్యాధి పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలని, అనుమానం ఉన్న వారంతా టీవీ పరీక్ష చేయించుకోవాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. జాతీయ టీబీ నిర్మూలన కార్యక్రమంలో భాగంగా మెట్రోసెమ్ సంస్థ ఆధ్వర్యంలో టీవీ వ్యాధిగ్రస్తులకు న్యూట్రిషన్ కిట్ల పంపిణీ కార్యక్రమం మొహతాజ్ ఖానాలోని అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం జరిగింది.

కార్యక్రమానికి హాజరైన జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి టీబీ వ్యాధిగ్రస్తులకు న్యూట్రిషన్ కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రాథమిక దశలోనే టీబీని గుర్తించి మందులు వాడితే సులభంగా నయమవుతుందని అన్నారు. అన్ని ప్రభుత్వాసుపత్రిలోనూ టీబీ పరీక్ష అందుబాటులో ఉందని తెలిపారు. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారికి టీబీ తొందరగా వ్యాపిస్తుందని, అందువల్ల సమతుల పోషకాహారం తీసుకోవాలని సూచించారు.

టీబీ వ్యాధి పరీక్షలకు ప్రైవేట్ ఆసుపత్రిలో రూ. 15 వేల వరకు ఖర్చు అవుతుందని, ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ పరీక్ష ఉచితంగా చేయడంతో పాటు మందులు అందిస్తారని తెలిపారు. ప్రభుత్వం తరఫున ప్రతి నెలా టీబీ వ్యాధిగ్రస్తులకు అందిస్తున్న రూ.1000 పోషకాహారానికి వినియోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి వెంకటరమణ, టీబి ప్రోగ్రామ్ ఆఫీసర్ రవీందర్, ఇమినైజేషన్ ఆఫీసర్ సాజిద, పాల్గొన్నారు.