- సిబ్బంది, మందులు అందుబాటులో ఉండాలి
- వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనరసింహ
హైదరాబాద్, నవంబర్ 29 (విజయక్రాంతి): సీజనల్ వ్యాధులు విజృంభించ కుండా ప్రాథమిక ఆసుపత్రుల్లో అవసరమై న సిబ్బంది, మందులు అందుబాటులో ఉం డేలా చర్యలు చేపట్టాలని అధికారులను వై ద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనరసింహ ఆదేశించారు. గిరిజన ప్రాంతాల్లో సీజనల్ వ్యాధులపై నిరంతరం అప్రమత్తం గా ఉండాలని ప్రజారోగ్య శాఖ డైరెక్టర్‌కు మంత్రి సూచించారు.
సీజనల్ వ్యాధుల నిర్మూలన, వైద్య విధాన పరిషత్‌ను డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్‌కేర్‌గా బలోపేతం చేయడంపై సంబంధిత శాఖ అధికారులతో సచి వాలయంలో మంత్రి శుక్రవారం సమీక్ష ని ర్వహించారు. ఈ సందర్భంగా ఇంటిగ్రేటెడ్ హెల్త్ ఫెసిలిటీ మేజేజ్‌మెంట్ విధానంపై డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్‌తో చర్చించారు. రా ష్ట్రంలోని అన్ని బోధనాసుపత్రుల్లో ఉన్న బె డ్స్ సామర్థ్యం పెంపుపై చర్చించారు.
బోధన ఆసుపత్రుల్లో ఏజెన్సీలు, వారికి చెల్లించే పేమెంట్, కోర్టు కేసుల సత్వర పరిష్కార మా ర్గాలను అన్వేషించాలన్నారు. త్వరలో ప్రారంభించే నర్సింగ్ కాలేజీల్లో ఏర్పాట్లు, ట్రాన్స్ జెండర్ల క్లినిక్‌లు, కొత్తగా 108, 102 అంబులెన్స్ సేవలు ప్రారంభించేలా చర్యలు చేప ట్టాలని అధికారులను ఆదేశించారు. ఉస్మానియా, గాంధీ, ప్లేట్ల బురుజు ఆసుపత్రుల్లో పడకల సామర్థ్యంపై చర్చించిన అనంతరం ఐవీఎఫ్ సెంటర్ల సేవలను విస్తృతపరచాల ని సూచించారు. సమావేశంలో ప్రిన్సిపల్ సెక్రెటరీ క్రిస్టినా, కమిషనర్ కర్ణన్, టీజీఎంఎస్‌ఐడీసీ ఎండీ హేమంత్ వాసుదేవరావు, డీఎంఈ డాక్టర్ వాణిదేవి, హెల్త్ డైరెక్టర్ రవీందర్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు.