calender_icon.png 19 April, 2025 | 11:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి

03-04-2025 01:02:23 AM

సైబర్ క్రైమ్ డిఎస్పీ ఫణీంధర్

ఖమ్మం, ఏప్రిల్ 2 (విజయక్రాంతి):-ప్రస్తుత పరిస్థితులలో సైబర్ నేరాలపై మరింత అప్రమత్తంగా వుండాలని సైబర్ క్రైమ్ డీఎస్పీ సిహెచ్.ఆర్.వి. ఫణీందర్ అన్నారు. బుధవారం నగరంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజ్ విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా డిఏస్పీ మాట్లాడుతూ నకిలీ యాప్ ల ద్వారా డబ్బు, డేటా దోచుకుంటారని అన్నారు.

బెట్టింగ్ గేము ముందుగానే ప్రణాళికాబద్ధంగా అమలు చేసి యూజర్ల గెలుపును ప్రోత్సాహిస్తారని, డబ్బు గెలిచినప్పటికీ ఉపసంహరించుకోవడానికి అనుమతించని మోసపూరిత నియమాలను విధించి, డబ్బు విత్ డ్రా చేసుకోలేకుండా చేస్తారని పెర్కొన్నారు. వాట్సాప్ , ఇన్స్టాగ్రామ్, ఇమెయిల్, ఫేస్ బుక్ నకిలీ ఖాతాలు సృష్టించి, వాటి ద్వారా టిక్కెట్లు ఆఫర్ లో తక్కువకే కేటాయిస్తున్నట్లు నమ్మిస్తారని, ముందుగా కొంత డబ్బు తీసుకుని, ఇంకా కొంతమొత్తం కడితేనే టికెట్స్ ఇస్తాము లేకుంటే లేదని, చివరికి బ్లాక్ మేల్ చేస్తారని అన్నారు.

ఎల్లప్పుడు అధికారికమైన వ్బుసైట్లు లేదా అప్లికేషన్ల ద్వారా మాత్రమే టికెట్లు కొనుగోలు చేయాలన్నారు. మోసపోతే అధికారిక వెబ్ సైట్ లో ఫిర్యాదు చేయాలన్నారు.ఈ కార్యక్రమములో , సైబర్ క్రైమ్ ఎస్. ఐ. రంజిత్ కుమార్, హెడ్ కానిస్టేబుల్ ఎం. ప్రసాద్, ప్రభుత్య వైద్య కళాశాల ప్రిన్స్ పాల్ డాక్టర్ రాజేశ్వరావు, డాక్టర్ సరిత , కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.