calender_icon.png 19 April, 2025 | 4:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి

25-03-2025 12:00:00 AM

ఆదిలాబాద్, మార్చి 24 (విజయక్రాం తి): ఆధునిక సమాజంలో సైబర్ క్రైమ్ నేరా లు పెరుగుతున్న నేపథ్యంలో జిల్లా వాసులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు.  ప్రజలు ఎలాంటి సైబర్ నేరాల బారినపడిన వెంటనే 1930 టోల్ ఫ్రీనంబర్‌కి ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు. గత సంవత్సరం పోస్ట్ ఆఫీస్‌లోని రైతుల ఖాతాలోని డబ్బులను తన సొంత ఖాతాలోకి మళ్లించిన పోస్టాఫీస్ ఉద్యోగితో పలువురు రైతులు ఇబ్బందులు పడ్డారు.

ఇటీవల నూతన ఎస్పీని కలిసి తమ సమస్యను వివరించారు. దీంతో ఆరుగురికి డబ్బులు తిరిగి తమ ఖాతాల్లోకి వచ్చే విధం గా కృషి చేసిన ఎస్పీ అఖిల్ మహాజన్‌ను సోమవారం రైతులు కలిసి శాలువాతో సత్కరించి ధన్యవాదాలు తెలియజేశారు. జిల్లా ఎస్పీ సైబర్ క్రైమ్ డీఎస్పీ ఢిల్లీలోని సంబంధిత అధికారులకు ఫోన్ ద్వారా మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేశారు.