నిర్మల్ (విజయక్రాంతి): తెలంగాణ కోసం ఆత్మబలిదానం చేసుకున్న పోలీస్ కిష్టయ్య సభను జయప్రదం చేయాలని ముదిరాజ్ సంఘం నాయకులు పిలుపునిచ్చారు. శుక్రవారం పట్టణంలోని టీఎన్జీవో కార్యాలయంలో సభ పోస్టర్లను ఆవిష్కరించారు. తెలంగాణ కోసం ఆత్మబలిదానం చేసుకున్న పోలీస్ కిష్టయ్య మృతి చెంది 15 సంవత్సరాలు గడిచిన సందర్భంగా సభను ఏర్పాటు చేయడం జరుగుతుందని వారు తెలిపారు. ఈ సభకు ఉద్యమకారులు ముదిరాజ్ సంఘం నాయకులు పెద్ద ఎత్తున తరలి రావాలన్నారు. హైదరాబాదులో సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు గంగాధర్, హరీష్, శ్రీకాంత్ చిన్ను తదితరులు పాల్గొన్నారు.