calender_icon.png 15 January, 2025 | 9:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కష్టకాలంలో ప్రజలకు అండగా ఉండాలి

05-09-2024 01:20:39 AM

  1. యుద్ధప్రాతిపదికన పునరుద్ధరణ పనులు
  2. అవసరమైతే సిబ్బందిని డిప్యూట్ చేయండి
  3. రహదారుల పునరుద్ధరణకు రూ.24 కోట్లు 
  4. జిల్లా అధికారుల టెలీ కాన్ఫరెన్స్‌లో మంత్రి సీతక్క

హైదరాబాద్, సెప్టెంబర్ 4 (విజయ క్రాంతి): భారీ వర్షాలు, వరదలతో కష్టాలు పడుతున్న ప్రజలకు అండగా నిలవాలని పంచాయతీరాజ్ సిబ్బందికి మంత్రి సీతక్క ఆదేశాలు జారీ చేశారు. బుధవారం సచివాలయంలో పంచాయతీరాజ్, గ్రామీణా భివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖలపై పీఆర్ అండ్ ఆర్‌డీ సెక్రటరీ లోకేశ్‌కుమార్, కమిషనర్ అనిత రామచ ంద్రన్‌లతో కలిసి మంత్రి ఉన్నతస్థా యి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భం గా జిల్లాల వారీగా పరిస్థితులు, శాఖాపరంగా తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసు కున్నారు.

భారీ వర్షాల నేపథ్యంలో శాఖల వారీగా చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు దిశానిర్ధే శం చేశారు. గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణ, తాగునీటి సరఫరా, రోడ్ల పునరుద్ధ రణపై మంత్రి కీలక సూచనలు చేశారు. రహదారుల పునరుద్ధరణకు తక్షణమే రూ. 24 కోట్లు మంజూరు చేశామన్నారు. పను ల వేగాన్ని బట్టి మరిన్ని నిధులు విడుదల చేస్తామన్నారు. విపత్తుల సమయంలో అప్రమత్తత కోసం ప్రతి మండలంలో ఐదుగురు అధికారులతో ఫ్లడ్ మేనేజ్‌మెంట్ కమిటీలు ఏర్పాటు చేయాలని సూచించారు.

కమిటీలో ఎంపీడీవో, ఎస్‌ఐ, ఎమ్మార్వో, స్థానిక అధికారులు భాగస్వాములు కావాలన్నారు. ములుగు నియోజకవర్గంలో ఇలాంటి ప్రయోగంతో విజయవంతమైనట్లు మంత్రి పేర్కొన్నారు. చెరువులు, కుంటలు, వాగులు, కాలువలపై అక్రమ కట్టడాలను గుర్తించి.. వాటి వివరాలను కలెక్టర్లకు అందజేయాలన్నారు. వరద ప్రభావం లేని గ్రామాల్లో ని పారిశుధ్య సిబ్బందిని వరద ప్రాంతాలకు పంపి పారిశుధ్య పనులు త్వరగా పూర్తయ్యేలా చూడాలని మంత్రి కోరారు. 

టెలీ కాన్ఫరెన్స్‌లో చేసిన సూచనలు..

  1. తాగునీటి క్లోరినేషన్ - వర్షాకాలం లో రెట్టింపు క్లోరినేషన్ చేయాలనే గైడ్‌లైన్స్ ఉన్నాయి. 
  2. నీటి నాణ్యత పరీక్షలు పెంచాలి.
  3. వర్షం తగ్గిన వెంటనే ట్యాంక్‌లను శుభ్రం చేయాలి.
  4. పారిశుధ్య నిర్వహణ-చెత్త సేకరణ, సెగ్రిగేషన్, డిస్పోజల్ చేపట్టాలి.
  5. గ్రామాల్లో చెత్త పేరుకుపోకుండా ఎప్పటికప్పుడు శుభ్రపరచాలి.
  6. రోగాలకు ప్రధానంగా కారణమయ్యే పశు వ్యర్థాలు, మిగిలిన పశుగ్రాసాన్ని క్లియర్ చేయాలి. 
  7. వర్షం నీరు నిల్వ ఉండకుండా చూడాలి. ఆయిల్ బాల్స్ వాడాలి. 
  8. ఫాగింగ్ ఫ్రీక్వెన్సీ పెంచి, దోమలను నివారించాలి.
  9. లోకాజ్ వే లు ఉన్న చోట నీటి ప్రవాహం ఉంటే రాకపోకలను నియంత్రించేలా బ్యారికేడింగ్ చేయాలి.
  10. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా అప్రమత్తంగా ఉండాలి.
  11. శిథిలావస్థకు చేరుకున్న ఇండ్లను ఖాళీ చేయించి, ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలి.