calender_icon.png 19 April, 2025 | 8:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వాహనాలు నడుపునప్పుడు తప్పక శిరస్త్రాణం ధరించండి..

15-04-2025 07:15:39 PM

జిఎం శాలెం రాజు..

కొత్తగూడెం (విజయక్రాంతి): జిల్లాలో ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదాలు అత్యధికంగా జరుగుతున్నందున ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు వాహనాలపై ప్రయాణం చేస్తున్నప్పుడు, తప్పనిసరిగా శిరస్త్రాణం ధరించి (హెల్మెట్) ప్రయాణించాలని, ఫోర్ వీలర్ వాహనాలలో ప్రయాణిస్తున్నప్పుడు (కారులో) సీట్ బెల్ట్ తప్పక ధరించాలని తద్వారా ప్రయాణిస్తున్నప్పుడు ఏవైనా విపత్తులు సంభవించినట్లయితే ప్రాణాపాయం జరగకుండా ఉంటుందని కొత్తగూడెం ఏరియా జిఎం సాలెం రాజు అన్నారు.

ఉద్యోగస్తులు విధులకు హాజరవుతున్నప్పుడు, మస్టర్ సమయం కంటే ముందుగా బయలుదేరాలని, ఇంటి వద్ద నుంచి ప్రారంభమైనప్పటి నుండి భద్రత అవసరం అన్నారు. అతివేగంగా ప్రయాణం చేయవద్దని తెలియజేశారు. ప్రతి ఒక్క ఉద్యోగి పని స్థలాలలో అప్రమత్తంగా ఉండాలని తెలియజేశారు. సింగరేణి ఉద్యోగులు ప్రజలు మద్యం మత్తులో వాహనాలు నడపరాదని, మద్యం సేవించి విధులకు హాజరవడం చట్టరీత్యా నేరమన్నారు. ప్రతి ఒక్కరూ తమ వ్యక్తిగత ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయకుండా ప్రతిరోజు వ్యాయామము చేసి ఆరోగ్యన్ని, కాపాడుకోవాలని తెలియజేశారు.