ఈ మధ్య పిల్లల్ని నిద్రపుచ్చడం తల్లులకు పెద్ద టాస్క్ అయిపోయింది. పసివాళ్లు నిద్రపోవాలంటే జోలపాటలు బదులు స్మార్ట్ ఫోన్లు, టీవీల్లో రైమ్స్ పెట్టాల్సిందే. అది ఓకే కానీ.. స్క్రీన్ చూడటం వాళ్ల కళ్లకు మంచిదికాదు. మరెలా? మ్యూజిక్ ప్రొజెక్టర్‌ని ట్రై చేస్తే బెటర్.
పిల్లలు పడుకునే ఉయ్యాలకు మ్యూజిక్ ప్రొటెక్టర్‌ని అటాచ్ చేయొచ్చు. బ్యాటరీ సాయంతో పనిచేసే ఈ గాడ్జెట్ రెండు విధాలుగా పనిచేస్తుంది. దీన్ని ఆన్ చేయగానే ప్రొజెక్టర్ లో బొమ్మలు కనిపిస్తాయి. దాంతోపాటు మ్యూజిక్ ప్లే అవుతుంది. ప్రొజెక్టర్ మీద వచ్చే బొమ్మలు చూస్తూ.. మ్యూజిక్ వింటూ నిద్రలోకి జారుకుంటారు.
ఈ గాడ్జెట్ కిడ్స్‌ని అట్రాక్ట్ చేసేలా కలర్‌ఫుల్‌గా, స్టార్ ఆకారంలో తయారుచేసింది సుదౌషిబ్రాండ్. ఈ డివైజ్‌కి మ్యూజిక్, లైట్స్ ఆపరేట్ చేసేందుకు రెండు బటన్స్ ఉంటాయి. ఇది నాన్ టాక్సిక్, హై క్వాలిటీతో తయారైంది.
బేబీ హెడ్ ప్రొటెక్టర్
అప్పుడప్పుడే కూర్చునేందుకు ట్రై చేస్తున్న పిల్లల్ని చాలా కనిపెట్టుకుని ఉండాల్సి వస్తుంది. ఎందుకంటే కూర్చుని ఆడుకునేటప్పుడు తెలియకుండానే బ్యాలెన్స్ తప్పి వెనక్కి పడిపోతుంటారు. కాబట్టి వాళ్లకు దెబ్బ తగలకుండా ప్రొటెక్ట్ చేయాలంటే.. వెనక మెత్తటి ప్రొటెక్టర్ ఉండాలి.
ఆ ప్రొటెక్టర్ ఇది. మెత్తటి దిండులా ఉండి, పిల్లలకు నచ్చేలా రంగుల బొమ్మలతో దీన్ని సిన్‌లార్క్ బ్రాండ్ అనే కంపెనీ తయారుచేసింది. దీన్ని వాడటం పద్ద కష్టమేమీ కాదు. బ్యాగ్‌లా భుజాలకు తగిలించాలంతే. పిల్లల వయసు బట్టి షోల్డర్ స్ట్రాప్‌ని అడ్జస్ట్ చేయొచ్చు.
ఇంట్లో, బయట ఎక్కడైనా సరే పిల్లలకి దెబ్బ తగలకుండా కాపాడుతుంది. వీపుకు వేయడం అంటే బరువు ఉంటుందేమో అనే సంశయం అక్కర్లేదు. ఇది లైట్ వెయిట్‌గా ఉంటుంది.