calender_icon.png 22 March, 2025 | 9:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫిర్యాదుదారుల పట్ల బాధ్యతగా వ్యవహరించాలి

22-03-2025 02:21:54 AM

దోమకొండ, బీబీపేట పోలీస్ స్టేషన్లను సందర్శించిన జిల్లా ఎస్పి యం.  రాజేష్ చంద్ర పోలీస్ స్టేషన్ పరిధిలో విసిబుల్ పోలీసింగ్ ఉండాలి చుట్టూ పరిసర ప్రాంతాలు, రిసెప్షన్, రికార్డ్, రైటర్ రూమ్ పరిశీలన ఆన్లైన్ బెట్టింగ్స్, బెట్టింగ్ ఆప్స్, సైబర్ క్రైమ్స్ గురించి, ప్రజలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి పోలీస్ స్టేషన్ రికార్డులను, సిబ్బంది విధులను పరిశీలించిన జిల్లా ఎస్పీ

బాన్సువాడ మార్చి 21 (విజయ్ క్రాంతి): శుక్రవారం కామారెడ్డి జిల్లాలోని దోమకొండ, బీబీపేట పోలీస్ స్టేషన్లను  జిల్లా ఎస్పి సందర్శించడం జరిగింది.  పోలీస్ స్టేషన్ లలో పని చేసే సిబ్బందికి ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. పోలీస్ స్టేషన్‌కి వచ్చే ఫిర్యాదు దారులను గౌరవంగా వ్యవహరిస్తూ రిసెప్షన్ సెంటర్ నందు ప్రతి ఒక్క ఫిర్యాదుని నమోదు చేసుకొని బాధితులకు సత్వర పరిష్కారం అందించే దిశగా కృషి చేయాలని తెలిపారు.

పోలీస్ స్టేషన్ ఆవరణ పరిశుభ్రముగ  ఉంచుకోవాలని తెలియజేశారు.  పోలీస్ స్టేషన్ రికార్డులను ఎప్పటికప్పుడు నవీకరిస్తూ ఉండాలని తెలియజేశారు. రెండు పోలీస్ స్టేషన్ల  పరిధిలో రోడ్డు ప్రమాదాలను తగ్గించేదుకు  ప్రత్యేకంగా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్లు నిర్వహిస్తూ వాటిని అరికట్టాలని తెలిపారు. దొంగతనాలు జరగ కుండా  రాత్రి పూట గస్తి  బీట్లు, పెట్రోలింగ్ నిర్వహించాలని 100 కాల్ కి వెంటనే స్పందించి ఆపదలో ఉన్న వారికి తక్షణ సహాయం అందజేయలాని అన్నారు. 

 అదేవిధంగా రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రజలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, యస్.హెచ్.ఒ కు పలు సూచ నలు చేశారు.   సులభ మార్గంలో అధిక డబ్బులు సంపాధించాలనే అత్యాశతో యు వత ఆన్లైన్ బెట్టింగ్స్ ఆన్లైన్ గేమ్స్ ఆడుతూ.. సైబర్ మోసగాళ్ళ చేతిలో చిక్కి డబ్బులు కోల్పోతూ.. అప్పులు చేసి, చేసిన అప్పులను తీర్చలేక తనువును చాలిస్తున్నారని అన్నారు.

గేమింగ్ యాప్ ల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఎస్పి సూచించారు. ఈ కార్యక్రమంలో భిక్నూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సంపత్ కుమార్, దోమకొండ యస్.హెచ్.ఓ స్రవంతి, బీబీపేట  యస్.హెచ్.ఓ ప్రభాకర్ మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. బీబీపేట  యస్.హెచ్.ఓ స్రవంతి సిబ్బంది పాల్గొన్నారు.