calender_icon.png 10 October, 2024 | 6:31 PM

బాధ్యతయుతంగా వ్యవహరించండి

10-10-2024 04:21:42 PM

మహబూబ్ నగర్, (విజయక్రాంతి): పోలీసు వ్యవస్థలోని ప్రతి ఒక్కరూ ఆయుధాన్ని గౌరవిస్తూ బాధ్యతాయుతంగా తమ విధులను నిర్వహించాల్సిన అవసరం ఉందని జోగులాంబ జోన్ డిఐజి ఎల్ ఎస్ చౌహన్ స్పష్టం చేశారు. దుర్గాష్టమి సందర్భంగా గురువారం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో  ఆయుధ, వాహన పూజ కార్యక్రమానికి ఆయన హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ఈ పూజలో ముఖ్య అతిథిగా జోగులాంబ జోన్ డిఐజి ఎల్ ఎస్ చౌహన్  దసరా పండుగను పురస్కరించుకొని ఆయుధ పూజకు ప్రత్యేక స్థానం ఉందని తెలిపారు. ఈ పూజ సందర్భంగా ఆయుధాలను, వాహనాలను పూలతో అలంకరించి, ప్రత్యేక పూజలు చేయడం జరిగిందని తెలిపారు. సిబ్బందిని స్ఫూర్తివంతంగా ఉద్దేశించి, సమాజంలో శాంతి, భద్రతను కాపాడడంలో తమ పాత్ర ఎంత ముఖ్యమైందో వివరించారు.

పోలీసు వ్యవస్థలో ఇది సంప్రదాయమై, ప్రతి సంవత్సరం దసరా పండుగ సమయంలో ఇది జరుగుతూ ఉంటుందని వివరించారు. అనంతరం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రజలకు, పోలీసు సిబ్బందికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ పూజ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ జానకి, అదనపు ఎస్పీ రాములు, ఏఆర్ అదనపు ఎస్పీ సురేష్ కుమార్, డి.ఎస్.పి వెంకటేశ్వర్లు, డి సి ఆర్ బి డి ఎస్ పి రమణా రెడ్డి, ఏఆర్ డీఎస్పీ శ్రీనివాసులు, వన్ టౌన్ సీఐ అప్పయ్య, రూరల్ సీఐ గాంధీ, ఆర్ఐఅడ్మిన్ కృష్ణయ్య, ఆర్ఐ ఎంటిఓ నగేష్, ఆర్ఐ డిటిసి రమేష్ మరియు పోలీసు సిబ్బందికి అందరూ పాల్గొన్నారు.