కలెక్టర్‌పై దాడిని ఖండించిన పీసీబీ ఉద్యోగులు
హైదరాబాద్, నవంబర్ 12(విజ యక్రాంతి): ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిలా పనిచేసే అధికారులతో ప్రతిఒక్కరూ గౌరవంగా మెల గాలని తెలంగాణ పొల్యూషన్ కంట్రో ల్ బోర్డు(పీసీబీ) ఉద్యోగుల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు శ్రీవాస్త వ, కృపానంద్ సూచించారు. మంగళవారం హైదరాబాద్‌లోని పీసీబీ ప్రధా న కార్యాలయం ముందు అధికారు లు, సిబ్బంది నిరసన తెలిపారు.
వికారాబాద్ జిల్లాలో ఫార్మాసిటీ కోసం నిర్వహించిన భూసేకరణ సమావేశం లో పాల్గొన్న కలెక్టర్‌తోపాటు విధుల్లో ఉన్న సిబ్బందిపై జరిగిన దాడిని వారు తీవ్రంగా ఖండించారు. కాలు ష్య నియంత్ర ణ మండలి చేపట్టే పబ్లిక్ హియరింగ్‌లకు కూడా పోలీసులు భద్రత ఏర్పా టు చేయాలని కోరారు.