07-02-2025 12:00:00 AM
వికారాబాద్, ఫిబ్రవరి 6: 2024-25 రబీ ధాన్యం కొనుగోలుకు సిద్ధంగా ఉండాలని జిల్లా అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్ అధికారులకు తెలిపారు.
గురువారం రబీ 2024-25 ధాన్యం సేకరణ కార్యచరణ ప్రణాళిక, 2023-24 సిఎంఆర్ డెలివరీ, రేషన్ కార్డులు, మిల్లర్ల అసోసియేషన్ల బ్యాంకు గ్యారంటీ పత్రాల సమర్పణ తదితర అంశాలపై పౌరసరఫరాల ముఖ్య కార్యదర్శి డి.ఎస్.చౌహన్ ఉన్నత అధికార తో కలిసి జిల్లా అదనపు కలెక్టర్లు, పౌరసరఫరాల అధికారులు, జిల్లా మేనేజర్లు, వ్యవసాయ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించి పలు సూచనలు సలహాలు ఇచ్చారు.
అనంతరం జిల్లా అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్ అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ 2024-25 రభీ సీజన్ లో 2,25,000 మెట్రిక్ టన్నుల వరి ధాన్యం వస్తుందని అంచనా వుందని, లక్ష టన్నుల ధాన్యాన్ని సేకరించేందుకు ప్రణాళికలతో సిద్ధంగా ఉండాలన్నారు. 2023-24 ఖరీఫ్ సీఎంఆర్ వంద శాతం వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ అధికారులకు సూచించారు.