01-03-2025 01:04:07 AM
ఖమ్మం ఫిబ్రవరి 28( విజయక్రాంతి ): ప్రభుత్వ ఆరట్స్ సైన్స్ అటానమస్ కళాశాల భౌతిక శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని కళాశాల భౌతిక శాస్త్ర విభాగాధిపతి శ్రీమతి పి అనిత అధ్యక్షతన ప్రిన్సిపల్ మహమ్మద్ జకీరుల్లా ముఖ్య అతిథిగా శుక్రవారం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి కీనోటు స్పీకర్ గా రిటైర్డ్ అసోసియేట్ ప్రొఫెసర్ పి రాంబాబు వ్యవహరించారు. విజ్ఞాన శాస్త్రంలో భారతదేశ ఎంతో ప్రగతిని సాధించిందని అగ్రదేశాల సరసన భారత్ నిలిచినందుకు గర్వపడుతున్నామని తెలియజేశారు.
కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎండీ. జేకిరుల్లా మాట్లాడుతూ నేటి ప్రపంచం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యుగం నుండి ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ యుగంలోకి ప్రవేశించిందని, నేడు సైన్స్ సోషల్ సైన్సెస్ విభాగాలలో ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ యొక్క ప్రాముఖ్యతను వివరించారు. నేటి విద్యార్థులకు నూతన ఆవిష్కరణలకు కళాశాల అధ్యాపకుల సహకారము ఉంటుందని వారి సేవలను వినియోగించుకొని నూతన ఆవిష్కరణల దిశగా విద్యార్థులను సంసిద్ధం చేయాలని తెలియజేశారు.
సైన్స్ డే సందర్భంగా నిర్వహించిన క్విజ్, వన్ మినిట్ షో, ఇన్నోవేటివ్ ఐడియాస్, వకృత్వ, పోస్టర్ ప్రదర్శన అంశాలలో జిల్లా స్థాయి పోటీల లో విజయం సాధించిన విద్యార్థులకు మెమెంటోలు సర్టిఫికెట్లు ప్రధానం చేశారు. కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన కన్వీనర్ సూరంపల్లి రాంబాబు ను డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిజిక్స్ హెచ్‌ఓడి పి అనితను అభినందించారు. కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ ఏఎల్‌ఎన్ శాస్త్రి, వైస్ ప్రిన్సిపాల్ సైన్సెస్ భానోత్ రెడ్డి, ఐ కే సి కోఆర్డినేటర్ డాక్టర్ సునంద, భౌతిక శాస్త్ర విభాగ ఆచార్యులు బి శ్రీనివాస్, కె కిరణ్ కుమార్, బి రాజశేఖర్, ధర్మయ్య,అనురాధ పాల్గొన్నారుకళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ భానోత్ రెడ్డి, వివిధ విభాగాల నుండి అధ్యాపకులు కె. కార్తిక్, డాక్టర్ పి. రవికుమార్, పి.శ్రీనివాస్, డాక్టర్ పి రామచంద్ర రావు, శ్రీమతి బిందుశ్రీ, ఇంద్రాణి, డాక్టర్ పి. విజయకుమార్, ప్రభాకర్, జే.అనిత కుమారి, గౌసియా షేక్, కె. మధు, డాక్టర్ పి పూర్ణచంద్రరావు డాక్టర్ ఎన్ అనిత తదితరులు పాల్గొన్నారు.