14-02-2025 12:00:00 AM
జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి
కరీంనగర్, ఫిబ్రవరి13(విజయక్రాంతి): ఆర్‌ఓలు, ఏఆర్‌ఓలకు శిక్షణ స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా రిటర్నింగ్ అధికా రులు సిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. గ్రామపంచా యతీ ఎన్నికల విధుల నిర్వహణపై కలెక్టరేట్ ఆడిటోరియంలో గురువారం రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారు లకు మాస్టర్ ట్రైనర్లు శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి హాజరైన కలెక్టర్ మాట్లాడు తూ పంచాయతీ ఎన్నికల్లో రిటర్నింగ్ అధికారులు ముఖ్యపాత్ర పోషిస్తారని అన్నారు.
అందువల్ల ఎన్నికల విధులను ఎంతో జాగ్రత్తగా నిర్వర్తించాలని సూచించారు. ఎన్నికల నియమ, నిబంధనల గురించి స్పష్టమైన అవగాహన ఉన్నప్పుడే పొరపా ట్లకు ఆస్కారం లేకుండా ఉంటుందని అన్నా రు. ఎన్నికల సంఘం ద్వారా అందించిన కర దీపికను రిటర్నింగ్ అధికారులు తప్పని సరిగా చదవాలని పేర్కొన్నారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకు సజావుగా ఎన్నికలు జరిగేలా కృషి చేయాలని తెలిపారు.
ఎలాంటి సందేహాలు ఉన్నత అధికారుల ను అడిగి నివృత్తి చేసుకోవాలని సూచిం చారు. నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, పార్టీ గుర్తుల కేటాయింపు, బ్యాలెట్ పద్ధతిలో ఓటింగ్ విధానం, ఓట్ల లెక్కింపు, ఎన్నికల నియమావళి తదితర అంశాలపై మాస్టర్ ట్రైనర్లు దేవి శ్రీనివాస్, టీ.సంపత్, ఆర్.ర వీందర్, పరశురాం శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ ప్రపుల్ దేశాయ్, డిపిఓ పవన్ కుమార్ పాల్గొన్నారు.