సైన్యానికి జిన్‌పింగ్ పిలుపు
న్యూఢిల్లీ, అక్టోబర్ 20: తైవాన్, చైనా మధ్య తరచూ ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో యుద్ధానికి రెడీగా ఉండాలని చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ఆ దేశ సైనికులకు పిలుపునిచ్చినట్లు తెలుస్తోంది. అక్కడి అధికారిక మీడియా సంస్థ ఈ మేరకు కథనాన్ని వెలువరించింది.
ఈ కథనం ప్రకారం అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ తాజాగా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ రాకెట్ ఫోర్స్‌కు చెందిన బ్రిగేడ్‌ను సం దర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యుద్ధానికి సన్నాహాలను సమగ్రంగా బలోపేతం చేయాల ని, దళాలు పటిష్ఠమైన పోరాట సామర్థ్యాలను కలిగి ఉండేలా చూడాలని సైన్యానికి సూచించినట్లు పేర్కొంది.