calender_icon.png 24 October, 2024 | 5:50 AM

పోరాటాలకు సిద్ధం కావాలి

24-10-2024 01:34:06 AM

మహిళలకు ఐద్వా రాష్ట్ర మహాసభ పిలుపు

భద్రాద్రి కొత్తగూడెం, అక్టోబర్ 23(విజయక్రాంతి): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలకు ఇచ్చిన హామీల అమలు కోసం పోరాటాలకు సిద్ధం కావాలని మహిళలకు అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) పిలుపునిచ్చింది. మహిళలకు 33 శాతం చట్టసభల్లో రిజర్వేషన్ అమలు చేయా లని ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి డిమాండ్ చేశారు.

కొత్తగూడెంలోని కొండపల్లి దుర్గాదేవి ప్రాంగణం (కొత్తగూ డెం క్లబ్)లో రెండు రోజులుగా  జరుగుతు న్న ఐద్వా రాష్ట్ర  ప్రతినిధుల మహాసభలో బుధవారం ఆమె  మాట్లా డారు. దేశవ్యాప్తంగా మహిళలపై జరుగుతున్న హింస, వేధింపులను ప్రొత్సహించే విధంగా  బీజేపీ ప్రభు త్వం ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు.

ఆరు గ్యారంటీల అమలు ను కాంగ్రెస్ అటకెక్కించిందని విమర్శించారు. వడ్డీలేని రుణాలను డ్వాక్రా మహి ళలకు ఇవ్వాలని కోరారు. మహాసభలో  600 మంది ప్రతినిధులు, అఖిలభారత అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పీక  కేవప మరియం, ధావలే, కోశాధికారి పుణ్యవతి, జాతీయ ఉపాధ్యక్షురాలు సుధాసుందర్ రామన్ తదిరులు  పాల్గొన్నారు.