మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు
నాగర్‌కర్నూల్, నవంబర్ 16 (విజయక్రాంతి): రైతుల పట్ల రైస్‌మిల్లర్లు సానుకూలంగా వ్యవహరించి తేమ పేరుతో ఇబ్బందులు పెట్టొద్దని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు కోరారు. శనివారం నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండ మండల కేంద్రంలోని వెంకటేశ్వర రైస్ మిల్లును ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆరుగాలం కష్టపడి పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తెస్తే వారిని తేమ పేరుతో ఇబ్బందు లకు గురిచేస్తున్నట్లు తమదృష్టికి వచ్చిందన్నారు. రైతులను ఇబ్బందులకు గురిచేస్వే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.