ఎమ్మెల్యే యెన్నం
మహబూబ్‌నగర్, డిసెంబర్ 25 (విజయక్రాంతి) : ప్రతి రంగంలోనూ మహబూబ్ నగర్ జిల్లాను మొదటి స్థానంలో నిలిపేందుకు సాయి శక్తు లుగా కృషి చేయాలని ఎమ్మెల్యే ెున్నం శ్రీనివాసరెడ్డి అన్నారు. బుధ వారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యేను టీజీవో నూతన అధ్యక్షులు విజయ్ కుమార్ ముదిరాజ్ ఆధ్వర్యంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు పుష్పగు చ్చం అందజేసి శాలువాతో ఘనం గా సన్మానించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ టీజీవో ఉద్యోగులు వివిధ శాఖల్లో విధులు నిర్వహిస్తున్నారని అన్ని శాఖల్లో మహబూబ్‌నగర్‌ను ముందు స్థా నంలో చూసేలా సాయి శక్తుల కృషి చేయాలని తెలిపారు. రాష్ర్టంలోనే మహబూబ్‌నగర్‌ను మొదటి స్థానంలో ఉంచే ప్రయత్నం చేయాల ని సూచించారు. కార్యక్రమంలో రాష్ర్ట తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ ఉపాధ్యక్షుడు మాచర్ల రామకృష్ణ గౌడ్, జిల్లా అధ్యక్షులు విజయ్‌కు మార్, ఉపాధ్యక్షురాలు కె.సంధ్య, కార్యదర్శి కె.వరప్రసాద్, అదనపు కార్యదర్శి జాకీర్, ఆఫీస్ కార్యదర్శి జగన్ మోహన్, సభ్యులు ఆర్ రవింధర్, మురళీధర్, శ్రీనుగౌడ్, నాగరాజు, చంద్రకళ, గంగాధర్, రాష్ర్ట సభ్యులు బక్క శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.