బీజింగ్: పెళ్లి చేసుకుని ఇల్లు చూసుకుని ఏంచక్కా.. పెళ్లాం పిల్ల గాళ్ల తో చల్లగా కాలం గడపాలోయ్.. అంటున్నారు చైనా సర్కారువారు.. దేశంలో జననాల రేటు పడిపోవటం, సీనియర్ సిటిజన్ల సంఖ్య విపరీతంగా పెరిగిపోవడంతో ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో చీనిస్తానీ సర్కారు ఇలా వేడుకోవటానికి ప్రధాన కారణం అంటున్నారు. చైనా నిబంధనల ప్రాకారం 22 ఏల్ల దాటిన యువకులు, 20 ఏళ్లు దాటిన యువతులు మాత్రమే వివాహ బంధంలో ఉండాలి. కానీ పెరుగుతున్న ఖర్చులు, పిల్లల పోషణ భారం కావడంతో చాలామంది వివాహా బంధానికి దూరంగా ఉంటున్నారు. ఈ మేరకు వృద్ధుల జనాభా గణనీయంగా పెరిగి పోయింది. చైనా పూర్తిగా వృద్ధుల దేశంగా మారుతోందన్న ఆందోళనల నేపథ్యంలో పలు వురు వ్యహకర్తలు పెళ్లిల్లను ప్రోత్సహించాలని సర్కారుకు సూచిస్తున్నారు.