జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి అర్పిత
మంచిర్యాల (విజయక్రాంతి): బీపీఎల్ (పేడవారికి) కింద ఉన్న వారికి న్యాయ సలహాలు, సహాయం కోసం 15100 టోల్ ఫ్రీ నెంబర్ ను సంప్రదించాలని జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి అర్పిత మారంరెడ్డి అన్నారు. ఎస్టీ పోస్ట్ మెట్రిక్ హాస్టల్ లో శనివారం బాలల హక్కులు-బాల కార్మికుల నిర్మూలన', వివిధ బాలల చట్టాల గురించి నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. బాల కార్మికుల నిర్మూలన, నిర్బంధ విద్యా హక్కు చట్టం, న్యాయసేవా అధికార చట్టం గురించి మాట్లాడారు. పోక్సో, వివిధ క్రిమినల్ చట్టాల గురించి అవగాహన కల్పించారు. అనంతరం ఎస్టీ హాస్టల్ నుంచి వెంకటేశ్వర థియేటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. అంతకుముందు హాస్టల్ లోని వంట సామాగ్రి, మరుగుదొడ్లు, క్యాంటీన్, రేషన్ ను పరిశీలించి తగు సూచనలు చేశారు. నాణ్యమైన భోజనం విద్యార్థులకు అందించాలని సిబ్బందిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిఫెన్స్ కౌన్సిల్ అడ్వకేట్ సంధాని, ఆర్ ఆర్ రాములు, కనకయ్య, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.