calender_icon.png 20 March, 2025 | 10:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎండలతో జర జాగ్రత్త!

20-03-2025 12:55:43 AM

చలివేంద్రాన్ని ప్రారంభించిన రాష్ట్ర పంచాయితీరాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమశాఖ మంత్రి వర్యులు డాక్టర్ సీతక్క 

 ములుగు, మార్చి 19 (విజయ క్రాంతి ): జిల్లా కేంద్రములో మాజీ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు స్వర్గీయ నల్లెల కుమారస్వా మి  జ్ఞాపకార్థం ములుగు జిల్లా హాస్పటల్ ముందు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవి చందర్  ఆధ్వర్యములో చలి వేంద్రం ఏర్పాటు చేయగా ముఖ్య అతిథిగా హాజరై చలి వేంద్రాన్ని ప్రారంభించిన రాష్ట్ర పంచాయితీ రాజ్

గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు డాక్టర్ దనసరి అనసూయ సీతక్క ఈ సందర్భంగా జి ల్లా ప్రజలను ఉద్దేశించి మంత్రి వర్యులు సీత క్క  మాట్లాడుతూరోజు రోజుకు ఉష్ణోగ్రతలు పెరిగి, వడగాలులు వీస్తున్నందున  ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు ఎండలో బయట తిరగొద్దని, వడదెబ్బ తగిలే అవకా శం ఉందన్నారు.

ప్రజలు వీలైనంత వరకు పగటి పూట ఇంటి వద్దనే గడపాలని, అత్యవసర పనులకు మాత్రమే బయటకు రావా లనిఅత్యవసర సమయాల్లో బయటకు వెళ్లా ల్సి వస్తే గొడుగులు, చేతి రుమాలు, టవల్ వినియోగించాలని, బయటి పదార్థాలు తినకూడదని, ఎక్కువగా నీళ్లను తాగాలని, పళ్ల రసాలు, కొబ్బరి నీళ్లు, మజ్జిగ లాంటి ద్రవ పదార్థాలనుతీసుకోవాలన్నారు ఎవరైనా వడదెబ్బకు గురైతే వెంటనే దగ్గరలోని ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లి సకాలంలో చికిత్స పొందాలని సూచించారు. ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్  జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బా నోతు రవి చందర్ తో పాటు కాంగ్రెస్ పార్టీ జిల్లా, బ్లాక్ మండల గ్రామ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.