03-03-2025 01:03:30 AM
నిరుడు ‘భూల్ భూలయ్యా3’తో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది బాలీవుడ్ నటి విద్యాబాలన్. కార్తీక్ ఆర్యన్ హీరోగా నటించిన ఆ చిత్రంలో విద్యాబాలన్.. మల్లిక అనే కీలక పాత్రలో కనిపించి ప్రేక్షకులను అలరించింది. ఇదిలా ఉండగా, విద్యాబాలన్‌కు సంబంధించిన కొన్ని వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.
దీం తో ఆ వీడియోలను ఉద్దేశించి విద్యాబాలన్ స్పందించింది. ఈ విషయమై తన ఇన్‌స్టా ఖాతాలో ఓ వీడియో సందేశాన్ని విడుదల చేసింది. ‘సోషల్ మీడియా, వాట్సాప్ గ్రూపుల్లో ఇటీవల నాకు సంబంధించిన కొన్ని వీడియోలు చక్కర్లు కొడుతున్నా యి. అవన్నీ ఏఐ జనరేటెడ్‌వి. వాటితో నాకు ఎలాంటి సంబంధం లేదు.
ఆ వీడియోలను సృష్టించడం లేదా వ్యాప్తి చేయడంలో నా ప్రమేయం లేదు. అందులోని కంటెంట్‌ను కూడా నేను ఏమాత్రం అంగీకరిం చను. కాబట్టి, సోషల్ మీడియాలో వీడియోలు షేర్ చేసేందుకు ముందు దయచేసి వాటి గురించి పూర్తి సమాచారం తెలుసుకోండి. ఏఐ జనరేటెడ్ కంటెంట్ మిమ్మల్ని తప్పుదోవ పట్టించే ప్రమాదం ఉంది. అప్రమత్తంగా ఉండండి’ అని పేర్కొంది.