calender_icon.png 29 November, 2024 | 7:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హెయిర్ సీరమ్‌తో జాగ్రత్త!

29-11-2024 12:00:00 AM

జుట్టు రాలిపోకుండా దృఢంగా ఉండాలని అమ్మాయిలు ఎక్కువగా హెయిర్ సీరమ్ వాడుతుంటారు. హెయిర్ సీరమ్‌ను రసాయనాలతో త యారు చేయడం వల్ల జుట్టు ఎక్కువగా రాలిపోతుందని నిపుణులు చెబుతున్నారు. హెయిర్ సీరమ్‌ను కొనేముందు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. హెయిర్ సీరమ్‌లో సల్ఫేట్లు, పారాబెన్స్, సిలికాన్ వంటి రసాయనాలు ఉన్నాయని పరిశోధనల్లో వెల్లడైంది.


సల్ఫేట్లు: హెయిర్ సీరమ్‌లో సల్ఫేట్ ఉందో లేదో చెక్ చేసుకుని వాడాలి.

ఎందుకంటే దీనివల్ల జుట్టు రాలిపోయి చుండ్రు సమస్య పెరుగుతుంది. కాబట్టి వాడే సీరమ్‌లో సల్ఫేట్ లేకుండా చూసుకోవాలి. ఈ కెమికల్స్ ఉన్న హెయిర్ సీరమ్‌లు వాడటం వల్ల జుట్టు పలుచగా అయిపోతుంది.

పారాబెన్స్: సీరమ్‌లో పారాబెన్‌లు ఉంటే అవి హార్మోన్ల అసమతుల్యతకు కారణమవుతాయి. దీనివల్ల జుట్టు ఎక్కువగా రాలిపోతుంది. వీటికి బదులు తలకు నూనె అప్లు చేయడం మంచిది. 

సిలికాన్: సీరమ్‌లో సిలికాన్ ఉంటే జుట్టు ఎక్కువ జిడ్డుగా ఉంటుంది. ఈ రసాయనం వల్ల జుట్టు చిట్లిపోవడంతో పాటు పొడిగా నిర్జీవంగా మారుతుంది. కాబట్టి హెయిర్ సీరమ్ కొనేముందు  ఈ రసాయనాలు లేనివి ఎంపిక చేసుకోవాలని అంటున్నారు నిపుణులు.