26-04-2025 12:00:00 AM
కూసుమంచి , ఏప్రిల్ 25 :-పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి.. బడులకు వేసవి సెలవులు , పిల్లలకు ఆటవిడుపు మొదలయ్యాయి.. పిల్లలకు ఆటలు ,తమ మిత్రులతో సరదా కోసం ఈతకు బయటకి వెళ్తుంటారు. తల్లిదండ్రులు జర జాగ్రత్త.. తప్పకుండా ఈ వేసవి సెలవుల్లో తమ పిల్లలపై ఒక కన్నేసి ఉంచండి.. ఎండలు మండిపోతున్నాయి. ఆటలకోసం బయటకి వెళ్ళి వడదెబ్బ తగిలిన , సరదా కోసం ఈతకు వెళ్లి బావుల్లో ,చెరువుల్లో ప్రమాద బారిన పడే అవకాశం ఉంది. ఏది జరిగిన తల్లిదండ్రులకు పుట్టెడు శోకం మిగులుతుంది..
ఎంత పనులు ఉన్న ,ఎన్ని పనులు ఉన్న తమ పిల్లలకు సమయం కానీ సమయంలో ఎండకు ఆటలు ఆడటం మంచిది కాదని చెప్పండి.. ఈతకు వెళ్తే తప్పకుండా ఈత వచ్చిన వ్యక్తి పక్కన ఉంటేనే వెళ్లమనండి.. ఈత నేర్చుకునేందుకు తగిన ఏర్పాట్లు చేసుకున్నాకే బావిలో కానీ చెరువులో కానీ దిగండి అని వారికి అర్దం అయ్యేలా చెప్పండి..
వేసవి సెలవులు వచ్చాయంటే ఎండదెబ్బ (వడదెబ్బ) తగిలి విద్యార్థి మృతి ,సరదా కోసం ఈతకు వెళ్లి విద్యార్థి మృత్యువాత పడ్డారు అనే విషాద సంఘటనలు గతంలో అనేకం చోటు చేసుకున్నాయి..
అందుకే మన పిల్లలకు మనమే రక్షణ ,జాగ్రత్తలు తీసుకోవాలి అనే జాగ్రత తల్లిదండ్రులదే.. పిల్లలకి ప్రమాదాల గురించి అవగాహన కల్పించాలి.. సాధ్యమైనంత వరకు బావుల దగ్గరకు ఒంటరిగా పంపకండి.. ఈ జాగ్రత్తలు మన మంచికే.. మంచి భవిష్యత్ ఉన్న విద్యార్థుల కోసం ఈ సూచనలు..