calender_icon.png 23 February, 2025 | 8:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏడడుగులు తడబడకుండా!

23-02-2025 12:10:04 AM

నూరేళ్ల జీవితానికి పెళ్లి బీజం లాంటిది. ఈ బంధం కలకాలం సంతోషంగా సాగాలంటే నచ్చిన భాగస్వామిని ఎంచుకోవాలంటున్నారు పెద్దలు. అయితే జీవిత భాగస్వామి ఎంపిక విషయంలో జాగ్రత్తగా అడుగులు వేయాలని సూచిస్తున్నారు. వైవాహిక జీవితం సంతోషంగా ఉండాలంటే జీవిత భాగస్వామిలో కచ్చితంగా కొన్ని లక్షణాలైనా  ఉండాలంటున్నారు. 

ఇంతకీ ఆ లక్షణాలు ఏమిటో మీకు తెలుసా?

వైవాహిక జీవితం సంతోషంగా ఉండాలంటే వివాహం చేసుకోబోయే భాగస్వామి(అబ్బాయి/అమ్మాయి)కి అత్యాశ ఉండకూడదు. దురాశలేని వారిని పెళ్లి చేసుకుంటే సంతోషంగా ఉంటారు. ఉన్నదాంట్లో సంతృప్తి చెందే మనస్తత్వం ఉన్నవారిని వివాహం చేసుకుంటే జీవితం సంతోషంగా ముందుకుసాగుతుంది. ఇక వివాహం చేసుకునే భాగస్వామిలో ఆధ్యాత్మిక భావాలు ఎక్కువగా ఉండేలా చూసుకోండి. ఇలాంటివారు నిత్యం శాంతంగా ఉంటారు. ఇలాంటి భావాలున్న వ్యక్తులు ఇతరుల పట్ల గౌరవంగా ఉంటారు. ముఖ్యంగా కుటుంబసభ్యులకు తగిన గౌరవం ఇస్తారు. 

కష్టం విలువ తెలిసినవారైతే.. 

కష్టం విలువ తెలిసినవారిని వివాహం చేసుకుంటే జీవితం సంతోషంగా ఉంటుంది. ఈ ఆలోచన విధానం ఉన్నవారు. అనవసర ఖర్చులు చేయరు. అలాగే జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యనూ సమర్థమంతంగా ఎదుర్కొంటారు. విజయం సాధించాలనే లక్ష్యం ఎక్కువగా ఉంటుంది. అలాంటివారిని వివాహం చేసుకుంటే సరైన భాగస్వామి లభించినట్లే. అలాగే ప్రేమించే వ్యక్తి కంటే అర్థం చేసుకునే వ్యక్తి దొరకడం అదృష్టమని చెబుతుంటారు. ఇది అక్షర సత్యం. జీవితంలో అర్థం చేసుకునే వ్యక్తి దొరికితే ఏదైనా సాధించవచ్చు. 

సహనం

సహనం, పట్టుదల ఉన్నవారు కుటుంబాన్ని అన్ని క్లిష్ట పరిస్థితుల నుంచి బయటపడేలా చేస్తారు. సంక్షోభ సమయాల్లో దృఢంగా ఉండట మే కాకుండా.. కుటుంబ సభ్యులకు అండగా నిలబడుతారు. అందుకే పెళ్లికి ముందే భాగస్వామి సహనాన్ని కచ్చితంగా పరీక్షిం చుకోవాలి. కోపంతో ఉన్న వ్యక్తులు జీవితంలో ఇబ్బందులను తీసుకొస్తారు. 

అందం ప్రామాణికం కాదు

అమ్మాయి అందంగా ఉందనో, అబ్బాయి అరడగులు ఉన్నాడనో భావించి పెళ్లి చేసుకోకండి. తెలివైన, అందమైన, ప్రతిభావంతులై నవారిని జీవిత భాగస్వామిగా చేసుకోవాలి. ఎట్టి పరిస్తితుల్లో అబద్ధాలు చెప్పేవారిని జీవిత భాగస్వామిగా ఎంచుకోవద్దు. ఎందుకంటే అబద్ధాలను చెప్పేవారు జీవిత భాగస్వామిగా తెచ్చుకోవడం జీవితానికి ప్రమాదకరం. అలాగే దంపత్య జీవితానికి మాటలు చాలా కీలకం. మంచి సంభాషణ సంబంధాలను ఏర్పరుస్తుందని గుర్తుంచుకోవాలి. మాటలు సరిగా లేకుంటే బంధం బలహీనపడుతుంది. లేదంటే విడాకులకూ దారితీసే అవకాశం ఉంటుంది.

నమ్మకం ముఖ్యం

జీవితంలో ముఖ్యమైన విషయం ఏంటంటే పెళ్లి చేసుకునే వ్యక్తి మీద నమ్మకం కచ్చితంగా ఉండాలి. నమ్మకం ఉంటేనే బంధంలో ముందుకు వెళ్లాలి. లేదంటే జీవితం ఆగిపోతుంది. అందుకే నమ్మకం అనేది చాలా అవసరం. నమ్మకం లేని బంధం ఎక్కువ రోజులు నిలవదు అని మానసిక నిపుణులు సైతం చెప్తున్నారు.

ఆకర్షణల వలలో పడొద్దు

జీవిత భాగస్వామిని ఎంచుకొనే విషయంలో చాలామంది గందరగోళానికి గురవుతున్నట్లు సైకాలజిస్టులు అభిప్రాయపడుతున్నారు. అందం, సంపాదన లాంటి ఆకర్షణల వలలో పడి తర్వాత పశ్చాత్తాప పడుతున్నారు. జీవితాంతం కలసి ఉండాల్సిన వ్యక్తి ఎలా ఉండాలంటే.. బాధ్యతల నుంచి పారిపోనివారు, మీరు మీలాగే జీవించే హక్కును గౌరవించేవారు. శాశ్వతమైన బంధాన్ని పరమావధిగా భావించేవారు. పరస్పర గౌరవాన్ని కలిగి ఉండేవారైతే మీ జీవితం బాగుంటుంది.