calender_icon.png 8 January, 2025 | 5:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్యాన్సర్ బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలి

06-01-2025 08:26:41 PM

మునగాల (విజయక్రాంతి): మండల పరిధిలోని కొక్కిరేణి గ్రామంలో డాక్టర్ పోటు పుల్లయ్య స్మారక వివేకానంద వైద్యశాల ఆధ్వర్యంలో మహిళలకు క్యాన్సర్ ‌పై అవగాహన సదస్సు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే ఉత్తం పద్మావతి రెడ్డి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆశా కార్యకర్తలు రాష్ట్రానికి హెల్ప్ లైన్ లాంటి వాళ్లు క్యాన్సర్ బారిన పడకుండా ప్రతి ఒక్కరు జాగ్రత్త పడాలి. క్యాన్సర్ బారిన పడకుండా అవసరమైన పరికరాల కొనుగోలుకు ప్రత్యేక నిధులు కేటాయిస్తానని హామీ ఇచ్చినారు. అనంతరం వైద్యశాల పరిసరాలను పరిశీలించి అక్కడ మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో వలిగొండ ఆంజనేయులు ఎంపీడీవో రమేష్ దీన్ దయాల్, కాంగ్రెస్ నాయకులు నల్లపాటి శ్రీనివాస్, ఉప్పుల జానకి రెడ్డి సిపిఎం నాయకులు మొలకలపల్లి రాములు పోటు సీతారాములు, వైద్యశాల డాక్టర్ సిబ్బంది, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.