calender_icon.png 11 March, 2025 | 12:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భాగస్వామి ఎంపికలో జాగ్రత్త!

08-03-2025 12:00:00 AM

నిస్వార్థమైన ప్రేమను తాను నమ్ముతానని చెబుతోంది మిల్క్ బ్యూటీ తమన్నా. ఎప్పుడైతే ప్రేమను వ్యాపార లావాదేవీగా చూడటం ప్రారంభిస్తామో.. అప్పుడే అసలు సమస్యలొస్తాయని చెప్పుకొచ్చింది. కొంత కాలంగా ప్రేమికులుగా చెలామణిలో ఉన్న నటి తమన్నా, నటుడు విజయ్‌వర్మ విడిపోయారంటూ ఇటీవల వార్తలొచ్చాయి. ఈ క్రమంలోనే తమన్నా ఇలా స్పందించింది.

ఆమె తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో పాల్గొంది. ‘ప్రేమ, రిలేషన్‌షిప్‌కు అసలైన అర్థం తెలియక చాలా మంది గందరగోళానికి గురవుతుంటారు. ఇద్దరు వ్యక్తుల మధ్య షరతులు ఎప్పుడు మొదలవుతాయో.. అక్కడ ప్రేమ అనేది ఉండదని నేను నమ్ముతా. ఎందుకంటే ప్రేమ నిస్వార్థమైనది. ప్రేమ భావోద్వేగాల సమ్మిళితం. ఆ బంధంలో ఎలాంటి షరతులూ ఉండవు. అలాంటివన్నీ వన్‌సైడ్ లవ్‌లోనే ఉంటాయి.

ఎదుటి వ్యక్తి ఎలా ఉండాలి? ఏం చేయాలనే విషయంలో నీకంటూ అంచనాలు ఏర్పడ్డాయంటే.. అది వ్యాపార లావాదేవీలతో సమానం. నేను ఎవరినైనా ప్రేమిస్తే వారి భావాలకు స్వేచ్ఛనిస్తానివ్వాలనీ, వారిని వారిలా ఉండనివ్వాలనే విషయాన్ని గ్రహించా. రిలేషన్‌లో ఉన్నప్పటి కంటే లేనప్పుడే నేను ఆనందంగా ఉన్నాననిపిస్తోంది. భాగస్వామిని కలిగి ఉండటం ఓ మంచి అనుభూతి. భాగస్వామి ఎంపికలో ఒకింత జాగ్రత్త అవసరం కూడా’ అని తెలిపింది తమన్నా.