‘ఫ్యాషన్ అనేది మన గురించి తెలియజేస్తుంది. ఎలాంటి దుస్తులు ధరించినా ధైర్యంగా ముందుకెళ్లాలి. నేను చీరకే ప్రాధాన్యమిస్తా. మీదైన స్టుల్‌లో ట్రెండ్‌ను సృష్టించండి’ అంటూ యువతరం అమ్మాయిలకు సలహా ఇస్తోందీ కేరళ కుట్టి సంగీర్తన విపిన్. నిరుడు ‘నరకాసుర’తో టాలీవుడ్‌కు పరిచయమైంది సంగీర్తన.. ‘జనక అయితే గనక’తో మరోమారు తెలుగు ప్రేక్షకులను పలకరించనుంది. సుహాస్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమా సెప్టెంబర్ 7న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సినీప్రియుల దృష్టి మరోమారు సంగీర్తన వైపునకు మళ్లింది. మలయాళ, తమిళ, తెలుగు చిత్రాల్లో నటిస్తున్న ఈ అమ్మడు ఇటీవల ఓ సందర్భంలో సక్సెస్ గురించి చెప్తూ.. ‘జీవితం అనేది కెమెరా లాంటిది. మంచి విషయాల మీద శ్రద్ధ పెట్టండి. చెడు విషయాల నుంచి నేర్చుకోండి. చేసే పనిలో విజయం దక్కకపోతే మరో షాట్ తీసుకొని ప్రయత్నించండి’ అని తెలిపింది.