03-04-2025 12:19:43 AM
మహబూబ్‌నగర్, ఏప్రిల్ 2 (విజయక్రాంతి) : ప్రతి విషయాన్ని తెలుసుకొని జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉందని సైబర్ క్రైమ్ డిఎస్పి కె సుదర్శన్ అన్నారు. బుధవారం సైబర్ జాగృక్ దివస్ సందర్భంగా సైబర్ నేరాలపై ప్రభుత్వ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళ డిగ్రీ కళాశాల నందు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సైబర్ భద్రతా నిబంధనలను పాటించి, ఆన్లైన్ మోసాలకు గురికాకుండా ఉండాలని సూచించారు. డిజిటల్ అరెస్ట్, బెట్టింగ్ గేమింగ్ యాప్స్, ఐపీఎల్ టికెట్ స్కామ్స్ ఇలాంటివి ఎవరు నమ్మకూడదని సూచించారు. ఇలాంటి ఇబ్బందులు ఉన్న టోల్-ఫ్రీ నంబర్: 1930, 8712672222 సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ ఎమ్. గోపాల్, సైబర్ క్రైమ్ ఎస్‌ఐ పి. శ్రవణ్, కళాశాల ప్రిన్సిపాల్ శ్రీమతి జయప్రద, కళాశాల అధ్యాపకులు, విద్యార్థినులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.