పులి సంచారంపై అవగాహన కార్యక్రమాలు
కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): పులులు జిల్లాలో అలజడి సృష్టించడంతో ఆటవిశాఖ అధికారులు అప్రమత్తం అయ్యారు. జిల్లాలో అటవీ ప్రాంత సమీప గ్రామాలలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. సోమవారం ఇస్గం విలేజ్ నంబర్ 6, చింతకుంట, చిట్యాల, రాల్లగుడా, దానాపూర్, రెబ్బెన గ్రామాల సమీపంలోని వ్యవసాయ క్షేత్రాలు, గ్రామాలలో అటవీశాఖ అధికారులు పర్యటించారు. ప్రజలకు పులి సంచారం పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరిస్తూ అవగాహన కల్పించారు. గుంపులుగా వెళ్లాలని పులి కదలికలను గమనిస్తూ ఉండాలన్నారు. తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ తలకు వెనుక భాగంలో మాస్కులు ధరించి వ్యవసాయ పనులు చేసుకోవాలని సూచించారు.