calender_icon.png 13 April, 2025 | 7:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైస్ పుల్లింగ్ మిషన్, గుప్త నిధులు, దొంగ నోట్లు మార్పిడి చేస్తామనే వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండలి

12-04-2025 10:14:48 PM

ఎస్సై రాజేష్..

బూర్గంపాడు (విజయక్రాంతి): రైస్ పుల్లింగ్ మిషన్, గుప్త నిధులు, దొంగ నోట్లు మార్పిడి చేస్తామనే వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని బూర్గంపాడు ఎస్సై రాజేష్ అన్నారు. శనివారం బూర్గంపాడు మండలంలోని సారపాక సెంటర్ వద్ద ఎస్సై రాజేష్ తన సిబ్బందితో పెట్రోలింగ్ చేస్తుండగా అనుమానాస్పదంగా కనిపించిన ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారిని  విచారించగా పాల్వంచకు చెందిన దొనకొండ సురేష్ బాబు, భద్రాచలం చెందిన షేక్ రహీం ఉర్ల శ్రీనివాసరావు అనేవారు రైస్ పుల్లింగ్ మిషన్ ఉందని చర్ల మండలం బతినపల్లి గ్రామానికి చెందిన కొమరం రాజాబాబును నమ్మించి రూ. లక్ష తీసుకొన్నట్లు ఒప్పుకున్నారు. మరో లక్ష రూపాయలు ఇస్తే రైస్ పుల్లింగ్ మిషన్ ఇస్తామని, మణుగూరు క్రాస్ రోడ్డు వద్దకు రావాలని సదరు వ్యక్తిని కోరారు.

ఈ ఏడాది జనవరి నెల 25 తారీఖున కొమరం రాజాబాబు వారు చెప్పిన ప్రకారం 1 లక్ష రూపాయలు తీసుకొని రావడంతో అతనిని కొట్టి డబ్బులు గుంజుకుని జంగారెడ్డిగూడెం చెందిన నారాయణతో కలిసి వెళ్లి పోయినట్లు వారు అంగీకరించినట్లు తెలిపారు. భద్రాచలంలో ఇంకా ఎవరైనా అమాయక వ్యక్తులకు రైస్ పుల్లింగ్ మిషన్ గురించి చెప్పి వారిని నమ్మించి, డబ్బులు తీసుకుందామనే ఉద్దేశంతో శనివారం భద్రాచలం వెళ్తుండగా సారపాక సెంటర్ వద్దకు రాగనే అనుమానించి వారని పట్టుకున్నట్లు ఎస్సై రాజేష్ తెలిపారు. ఈ ముగ్గురిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు పంపించినట్లు  తెలిపారు.