calender_icon.png 3 April, 2025 | 9:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విధుల్లో అప్రమత్తంగా ఉండాలి

25-03-2025 12:00:00 AM

సీపీ అంబర్ కిశోర్ ఝా

చెన్నూర్, మార్చి 24: రామగుండం పోలీ స్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా సోమవా రం మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన కోటపల్లి, నీల్వాయి పోలీస్ స్టేషన్‌లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీస్‌స్టేషన్ల పరి సరాలను పరిశీలించి స్టేషన్ పరిధి గ్రామా లు, సరిహద్దు ప్రాంతాలు, గతంలో జరిగిన సంఘటనల వివరాలు, మావోయిస్టులకు సంభందించి కదలికలపై ఆరా తీశారు.

సిబ్బంది ఎల్లపుడు విధుల్లో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. స్టేషన్‌కు వచ్చే బాధితులతో మర్యాదగా ప్రవర్తించి వారి సమస్యను తెలుసుకొని వారికీ భరోసా, నమ్మకం కల్పించాలని, చట్టపరిధిలో సమస్య పరిష్కరించాలని సూచించారు. సీపీ వెంట స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్రరావు, ఎన్‌ఐబీసీఐ కరుణాకర్, చెన్నూర్ రూరల్ సీఐ సుధాకర్, నీల్వాయి ఎస్‌ఐ శ్యామ్ పటేల్ తదితరులున్నారు.