మేడిపల్లి, జూలై30 (విజయ క్రాంతి): సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని పీర్జాది గూడ మేయర్ వెంకట్రెడ్డి మున్సిపల్ సిబ్బందికి సూచించారు. మంగళవారం పీర్జాదిగూ డలోని యూపీ హెచ్సీలో మున్సిపల్ సిబ్బందికి నిర్వహిం చిన ఉచిత వైద్య శిబిరాన్ని మేయర్ ప్రారంభించారు. రక్త, మూత్ర పరీక్షలు, బీపీ, థైరాయిడ్ వంటి పరీక్షలు నిర్వహించారు. కార్యక్రమంలో కమిషనర్ త్రిళేశ్వర్రావు, ఆర్వో శ్రీని వాస్రెడ్డి, పర్యావరణ ఇంజినీరు మురళి, డాక్టర్ ప్రతిభ, కుమార్, అనురాధ, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.