calender_icon.png 30 October, 2024 | 11:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి

02-07-2024 06:14:15 AM

  • మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు

సిద్దిపేట, జూలై 1 (విజయక్రాంతి): సీజనల్ వ్యాధుల పట్ల వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు అన్నారు. సోమవారం చిన్నకోడూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆరోగ్య కేం ద్రంలో అందుతున్న వైద్య సేవల గురించి ఆరా తీశారు. ప్రతి రోజు ఆసుపత్రికి వస్తున్న రోగుల వివరాలు, ఫార్మసీలో అందుబాటులో ఉన్న మందులు, రక్త పరీక్షల నమూనాల సేకరణ వంటి తదితర విషయాలను తెలుసుకున్నారు.

అనంతరం రికార్డులు పరిశీలించారు. వానకాలం ప్రారంభమైనందున ఇప్పటి వరకు నమోదైన డెంగ్యూ, మలేరియా జ్వరాల వివరాలు డాక్టర్‌ను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. డయాగ్నోస్టిక్ సెంటర్ల సేవలను మరింత విస్తరింపజేయాలని సూచించారు.   

ప్రజా సేవే శాశ్వతం..

పదవులు కాదు ప్రజా సేవనే శాశ్వతమని హరీశ్ రావు అన్నారు. సోమవారం నిర్వహించిన చిన్నకోడూర్ మండల చివరి సర్వసభ్య సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రంగనాయక సాగర్ ప్రాజెక్టు నిర్మించి రైతులకు సాగునీరందించిన ఘనత ఈ పాలకవర్గానికి దక్కిందన్నారు. పదవిలో లేకున్నా ప్రజా సేవలో ఉండాలని చెప్పారు. అనంతరం జెడ్పీ చైర్‌పర్సన్ రోజా శర్మ, ఎంపీటీసీలను ఘనంగా సన్మానించారు.