నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి
వెల్దుర్తి, ఆగస్టు 26: సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిటి సునీతారెడ్డి తెలిపా రు. సోమవారం ఉమ్మడి వెల్దుర్తి మండలానికి చెందిన 47 మంది బాధితులకు రూ. 10.94 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను స్థానిక బాలాజీ ఫంక్షన్ హాలులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పంపిణీ చేశా రు. గత ప్రభుత్వంలో దరఖాస్తు చేసిన సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు ఈ మధ్యనే విడుదల కాగా లబ్ధిదారులకు అందజేయడం జరిగిందన్నా రు. ఈ సందర్భంగా పలువురు తాజా మాజీ సర్పంచ్‌లు మాట్లాడుతూ.. పంచాయతీల్లో నిధులు లేక పారిశుద్ధ్య పనులు నిర్వహించడం లేదని.. దీనివలన గ్రామాల్లో విషజ్వ రాలు వ్యాపిస్తున్నాయని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయమై కలెక్టర్‌తో మాట్లాడి చర్యలు తీసుకుంటానని ఆయన హామీ ఇచ్చారు.