calender_icon.png 6 February, 2025 | 11:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాలం చెల్లిన మందుల పట్ల అప్రమత్తంగా ఉండాలి...

06-02-2025 07:54:19 PM

జిల్లా వైద్యాధికారి డాక్టర్ పుట్ల శ్రీనివాస్...

మునుగోడు (విజయక్రాంతి): కాలం చెల్లిన మందుల పట్ల ఫార్మసిస్ట్‌లు అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్య అధికారి పుట్ల శ్రీనివాస్ అన్నారు. గురువారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన డాక్టర్ వేణుగోపాల్ రెడ్డితో కలిసి ఆకస్మికంగా సందర్శించి మాట్లాడారు. ఐఎల్ఆర్, డిఎఫ్, స్టాక్, వాచ్ రిజిస్టర్‌ను తనిఖీ చేశారు. పిహెచ్‌సి ద్వారా అందజేసే అన్ని ఆరోగ్య సేవల మెరుగుదలకు అవసరమైన సూచనలు ఇచ్చారు. కొత్త ఇంటర్నీస్‌తో ఇంట్రాక్ట్ అయ్యి, చికిత్స ప్రోటోకాల్‌ల గురించి అవసరమైన సూచనలను అందించారు. ఆరోగ్య కేంద్రం ద్వారా రోగులకు అందించే సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండి పిహెచ్సిలో అందుబాటులో లేని వైద్యం గురించి సంబంధిత జిల్లా అధికారులకు తెలియజేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల వైద్యాధికారిని నర్మదా, వైద్య అధికారులు ఫార్మసిస్టులు ఉన్నారు.