calender_icon.png 25 November, 2024 | 12:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్ట్రాంగ్ రూంల వద్ద అప్రమత్తంగా ఉండాలి

17-05-2024 02:13:19 AM

జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ శశాంక 

రంగారెడ్డి, మే 16 (విజయక్రాంతి) : ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూంల వద్దని నిరంతరం అధికారులు భద్రతను పర్యవేక్షించాలని ఇక్కడ విధులు నిర్వహించే సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ శశాంక సూచనలు చేశారు. గురువారం చేవెళ్ల మండలంలోని గొల్లపల్లిలో బండారి శ్రీనివాస్ ఇన్‌స్టిట్యూట్ కళాశాల పోల్డ్‌లో ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూంలను ఆయన వెబ్‌కాస్టింగ్ స్క్రీనింగ్ ద్వారా పరిశీలించారు.

పార్లమెంట్ ఎన్నికలు ముగిసినంతరం చేవెళ్ల పార్లమెంట్ సెగ్మెంట్‌లోని ఏడు నియోజకవర్గాలకు చెందిన మహేశ్వరం, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, చేవెళ్ల, వికారాబాద్, పరిగి, తాండురూ నియోజకవర్గాలకు చెందిన ఈవీఎంలు, వీవీప్యాట్లు భద్రపరిచారు. ఆయా నియోజకవర్గాల వారీగా భద్రపరిచిన గదులకు వేసిన సీళ్లలను ఆయన వెబ్ స్క్రీనింగ్ ద్వారా పరిశీలించారు. 

స్ట్రాంగ్ రూంల వద్ద ఏర్పాటు చేసిన భద్రతా, నిరంతరం నిఘా కోసం అమర్చిన క్లోజ్డ్ సర్క్యూట్ కెమెరాల పనితీరు పర్యవేక్షించి అధికారులకు పలు సలహాలు, సూచనలు చేశారు. కలెక్టర్ వెంట చేవెళ్ల, కందుకురూ ఆర్డీవోలు సాయిరామ్, సురజ్‌కుమార్ ఉన్నారు.